

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మండల అధ్యక్షుడు శేషి కుమార్ అధ్యక్షతన డికె.స్నిగ్దా రెడ్డి సమక్షంలో స్వామి వివేకానంద యూత్, వాల్మీకి యూత్ 80 మంది పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కండువా కప్పి బిజెపి పార్టీలో ఆహ్వానించిన యువ నాయకురాలు డికె. స్నిగ్దా రెడ్డి
ముందుగా అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు స్వాగతం పలకడం జరిగింది.ఈ సందర్భంగా డికె.స్నిగ్దా రెడ్డి మాట్లాడుతూ.
దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుందని తెలియజేశారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేసి మెజారిటీ స్థానాలను గెలుచుకొని కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు..తెలంగాణలో BJP అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదిని అన్నారు.. అక్కడా కేంద్రంలో ..ఇక్కడా రాష్ట్రంలో BJP సర్కార్ ఉంటేనే అభివృద్ధి అని వచ్చే 30ఏళ్ల వరకు బీజేపీ ని దింపే నాయకుడే లేడని ప్రతిపక్షాల్లో మోడీకి ధీటైన లీడర్ ఈ దేశంలోనే లేడు…ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే .రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించుకోవాలని అన్నారు. 2047 కల్లా భారత్ ను ప్రపంచం లోనే నెంబర్ 1గా నిలబెట్టేందుకు నరేంద్ర మోదీగారు ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, అసెంబ్లీ కి పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా శివా రెడ్డి, రాజగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి స్వప్న,బిజెపి సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి నాగేశ్వర రెడ్డి, మిర్జాపురాం వెంకటేస్వర రెడ్డి,భీమన్న తిరుపతి ,మధుబాబు ,ఈసీ ఆంజనేయులు, గోవిందరాజులు ,తిరుమలేష్, రాజేష్ ,వీరేష్, చిన్నప్ప ,మద్దిలేటి,జమ్మన్న ,పరశురాముడు, గోవర్ధన్, మహేష్ ,దేవేంద్ర, తిమ్మప్ప తదితరులు ఉన్నారు..