

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
టి బి ఈ సి సి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్
మనన్యూస్,తిరుపతి:దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు ఉద్యోగులు అంతా సమ్మె చేయనున్నట్టు తిరుపతి బ్యాంకు ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ పిలుపునిచ్చారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం నగరంలోని ఇండియన్ బ్యాంకు జోనల్ కార్యాలయం ఎదుట యు ఎఫ్ బి యు కన్వీనర్ విజయ్ భాస్కర్ టిబిఈసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులతో కలిసి డిమాండ్ల సాధన కోసం ధర్నా చేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ గత ఏడాది మార్చి ఆరో తేదీ డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ లైన బ్యాంకులలో అన్ని క్యాడర్లలోని ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని,వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.ఏదేమైనా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులమంతా సమ్మెకు పోవడం ఖాయమని హెచ్చరించారు.అనంతరం తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి మహిళ బ్యాంకు ఉద్యోగులంతా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మహిళా ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ధర్నాలో కమిటీ సభ్యులు జనార్ధన్ భాస్కర్ కేశవరెడ్డి సుమలత రేష్మ నిర్మల వెంకటలక్ష్మి మహేష్ విగ్నేష్ నందకుమార్ పవన్ కుమార్ శంకర్రావు లక్ష్మీపతి నటరాజ్ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
