మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీలో పని చేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ భూమి మీద వెలుగులు ప్రసరించక ముందే ప్రతీ వీధిని,రోడ్డును పలకరించి వీధుల్లోని చెత్తను,కాలువల్లోని మురికిని శుభ్రం చేసి ఆరోగ్యకరమైన ప్రజాజీవనానికి పాటుపడుతున్నటువంటి నిస్వార్థ సేవకులు పారిశుధ్య సేవ చేయు మహిళలను సన్మానించుకోవడం మా సంస్థ అదృష్టమని మహిళలు ఎక్కడ పూజించబడతారో గౌరవింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్న నానుడికి నిజమైన తార్కాణం ఇదేనని తెలియజేశారు.కార్యక్రమంలో భాగంగా న్యూ బాలాజీ కాలనీ లోని సీకాం కాలేజీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం,రామచంద్ర పుష్కరిణి దగ్గర ఉన్న మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం లో కార్మికులకు ఉదయం ఐదు గంటలకు సుమ్మారు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ మొర్రిమేకల దేవరాజులు,వే ఫౌండేషన్ అంకయ్య,పారిశుధ్య ఉద్యోగులు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.








