

మన న్యూస్ , జీడీ నెల్లూరు :- జీడి నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కి జీడి నెల్లూరు అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు. అలాగే అతి తక్కువ కాలంలో జీడి నెల్లూరు లో ఎక్కడెక్కడ అభివృద్ధి జరగాలో ఎక్కడెక్కడ భూములు కబ్జా అయ్యాయో వాటిని వాటి వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు . అలాగే అసెంబ్లీలో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జీడి నెల్లూరులో జరగాల్సిన అభివృద్ధిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించి జీడి నెల్లూరు సమస్యలను ఆయా సేకల మంత్రులకు తెలిసే విధంగా వివరిస్తున్నారు. నెండ్రగుంట పెనుమూరు రోడ్డునైతేనేమి అలాగే పెనుమూరు మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులు అయితేనేమి జీడి నెల్లూరులో గల మామిడి తోటల మరియు మామిడిపండ్ల వ్యాపారాల గురించి గానీ ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీలో కృష్ణాపురం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, మత్స్యకారులకు భరోసాని కల్పిస్తూ , కృష్ణాపురం జలాశయం నందు చేపల పెంపకం మరియు ప్రాజెక్టుగా అనుసంధానంగా ఉన్న 16 సిస్టం ట్యాంకులకు మరమ్మత్తులు, సరైన దారి, చేపల మార్కెట్ మరియు గోడౌన్ నిర్మాణం గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా అసెంబ్లీ నందు సంబంధిత మంత్రి కి విన్నవించుకున్నారు ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్.
ఇంత కు ముందుగా చెప్పినట్లుగానే కృష్ణాపురం జలాశయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రాజెక్టు పరిధిలోని వంకలు కాలువలు కి త్వరలో ప్రభుత్వ నిధులు మంజూరు అవుతాయని అన్నారు. కుడి కాలువ, ఎడమ కాలువలు బాగు చేయడంతో పాటు ఆయకట్టు పరిధిలోని 3000 ఎకరాల భూములకు సాగనీరు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కబ్జాకు గురైన కాలువలను సర్వే చేయించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు.
