చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్, టీమిండియా టార్గెట్ 265

Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టుకు భారత్ బౌలర్ మొహమ్మద్ షమీ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగూ చేయని కూపర్, షమీ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. స్మిత్ అర్ధ సెంచరీ :- అయితే, ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన ట్రావిస్‌ను ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్మిత్, లబుషేన్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. వీరిద్దరు కలిసి ఆసీస్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే, ఇన్నింగ్స్ 23వ ఓవర్లో లబుషేన్(29)ను, 27 ఓవర్లో ఇంగ్లిష్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 73 పరుగులు చేసిన స్మిత్‌ను షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (7) కూడా వెంటనే ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత అలెక్స్ క్యారీ (57 బంతుల్లో 61 పరుగులు) రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, జడేజా, వరుణ్ రెండేసీ వికెట్లు తీశారు. న్యూజీలాండ్‌తో ఆడిన జట్టుతోనే భారత్ సెమీఫైనల్లో దిగింది. ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాట్ షార్ట్ స్థానంలో కూపర్, జాన్సన్ స్థానంలో స్పిన్నర్ తన్వీర్ సంఘా జట్టులోకి వచ్చారు. ఇండియా, ఆసీస్ జట్లు ,భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), కూపర్ కోనోలీ, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

Related Posts

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న…

గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు