మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త సేకరణ, రోడ్ల పరిశుభ్రత తదితర పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, పనులు మరింత వేగవంతంగా మరియు నాణ్యతతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పారిశుధ్య నిర్వహణ కొనసాగించాలని సూచించారు.స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన, పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బందిపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *