మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 12,000 పైచిలక గ్రామపంచాయతీ పరిధిలో గెలుపొందినటువంటి ఉప సర్పంచ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కెవి నరసింహ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,భారతదేశానికి ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎంత ఓద కలిగి ఉంటారో గ్రామపంచాయతీకి సైతం ఉపసర్పంచ్ అంతే హోదా అని గుర్తించి వారికి సైతం ఉపకార వేతనం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.ఉపసర్పంచ్ లకు ఉపకార వేతన వేయడం ద్వారా వారి కుటుంబ పరిస్థితి తో పాటు గ్రామపంచాయతీలో వారి ఓదాకు సైతం గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందిన ప్రతి ఒక్క ఉప సర్పంచ్కు వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *