మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డు మెంబర్ ఖాసింబి సోమవారం ముమ్మరంగా ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ పాషా మాట్లాడుతూ, 11వ వార్డు అభ్యర్థిగా మా అమ్మను నిలబెట్టడం జరిగిందని వార్డు సభ్యులు గౌను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో రోషనలి, అల్లావుద్దీన్, ఖలీల్ పాషా, మేబు, నింగప్ప తదితరులు పాల్గొన్నారు.