చిత్తూరు, మన ద్యాస నవంబర్-20: చిత్తూరు జిల్లా అసిస్ట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్ ని చిత్తూరు జిల్లా పి.ఆర్.టి.యు పక్షాన గౌరవ పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. విజయభాస్కర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. నరేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కనకాచారి, రాష్ట్ర కౌన్సిలర్లు ఆర్. మోహన్ రెడ్డి, భాస్కర రెడ్డి, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే జిల్లా నాయకులు సి. దేవేంద్ర, లవకుమార్, సుదర్శన్, తవనంపల్లె అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు యం. బాలచంద్ర రెడ్డి, యం. నరసింహ రెడ్డి, నాయకులు హేమచంద్ర రెడ్డి, యాదమరి యూత్ నాయకులు విశ్వనాధ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ కి నాయకులు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమం ఆలకించదగ్గ రీతిలో సాన్నిహిత్యపూర్వక వాతావరణంలో కొనసాగింది.







