మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి సాయి కోటి, పంచాయతీ రాజ్ అధ్యక్షుడు చొప్పర శివ, వైసీపీ నాయకులు సాయి రెడ్డి, అంబటి పవన్ కుమార్, శివారెడ్డి తదితరులు పాల్గొని సురేష్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.









