
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో, జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, జనసేన నేత మెడిశెట్టి బాబి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెద్దబాబు, సొసైటీ అధ్యక్షుడు పెంటకోట మోహన్, ఆధ్వర్యంలో కూటమినేతలతో కలిసి నిర్వహించిన ప్రచారంలో పలు వ్యాపారస్తులకు కరపత్రాలు పంచుతూ నూతన జిఎస్టి 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. సూపర్ జియస్ట్, సూపర్ సేవింగ్స్ అంటూ నినాదాలు కూటమి శ్రేణులు నినాదాలు చేసారు. జీఎస్టీని 28% నుండి 18 శాతానికి, 18 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించడంప్రజలకు ఖర్చు తగ్గుతుందని అన్నారు. నూతన జిఎస్టి విధానం ద్వారా రైతులు, వినియోగదారులు, వ్యాపారులు ఇలా ప్రతి రంగం వారు లబ్ది పొందుతారని ఎమ్మెల్యే అన్నారు.. ధరలు తగ్గడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా వ్యాపార రంగం అభివృద్ధి చెంది, ఆర్థిక అభివృద్ధికి దారి తీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, లక్ష్మణరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు పెంపికోట శ్రీధర్, జిల్లా ఎస్ సి. సెల్ నూకతాటి ఈశ్వరుడు, దనేకుల బాబ్జ,తోట వెంకటేశ్వరావు, గంగిరెడ్ల మణికంఠ, మగాపు వీరబాబు, పలివెల శ్రీనివాస్, స్థానిక నాయకులు, మరియు మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







