మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం : డా.సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు వృక్ష శాస్త్ర విభాగ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ ఆద్వర్యంలో సాసా( స్వచ్చ ఆంధ్ర-స్వర్ణాంధ్ర) కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. సునీత ముఖ్య అధితిగా పాల్గొని బొటానికల్ గార్డెన్ లో తొలి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తు భూమి పై ఉన్న ప్రతి జీవి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మొక్కలపై ఆదారపడి జీవించాలని మొక్కలు లేకపోతే మిగతా జీవరాసుల మగుగడ సాధ్యం కాదని, మొక్కలు మానవులకు,జంతువులకు ఆహారాన్ని,పండ్లు, కూరగాయలు,ధాన్యాలు,పప్పులు,నూనెగింజలు, వస్త్రాలు, ఔషధాలు,ఆక్సిజన్.గాలి శుద్దీకరణ, నేలసంరక్షణ, వాతావరణనియంత్రణ, జీవవైవిధ్యం వంటి అంశాలు మొక్కల ద్వారానే జరుగుతాయని కాబట్టి మనవంతుగా భావితరల మనుగడకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి వాతావరణ కాలుష్యాన్ని, ఆహార కొరతను తగ్గించాలని కోరారు. మొక్కలను నాటి పెంచితే అన్నీ జీవరాసులను పెంచినట్టేనని తెలియజేశారు, కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసినా బొటానికల్ గార్డెన్ లో సుమారు 200 మొక్కలు అధ్యాపక,అధ్యాపకేతర మరియు విద్యార్ధులు నాటారు. ఇందులో ఎర్రచందనం,జామ, జీడిమామిడి,మామిడి,మారేడు, నెరేడు, దానిమ్మ, సపోట,ఉసిరి, సైకాస్, జామియా, అరకేరియ, కార్డిలీన, హెమిలియ, జంథోస్టెమొన్, సెర్బెర, ముర్రయ,పెడిలాన్థుస్, బోగన్విల్లియ,ప్లూమేరియా, మొదలైన రకాల మొక్కలను నాటడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె వేంకటేశ్వరరావు, అధ్యాపకులు డా.మదీనా, డా.శివ ప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్రరావు, డా.బంగార్రాజు,సతీశ్, మేరీరోజలీనా, పుష్పా, రాజేష్ మరియు అధ్యాపకేత సిబ్బంది ధర్మ రాజు , దివ్య,రామలక్ష్మి కమల, కళావతి , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!