బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన న్యూస్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట రోడ్డు దుస్థితిపై చాలసార్లు ప్రముఖ పత్రికలలో వార్త ప్రచురించడం జరిగింది.వార్తలకు స్పందించిన అధికారులు బుధవారం జేసిపి సాయంతో రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ బాబు ప్రసాద్ మాట్లాడుతూ బంగారుపాళ్యం నుండి రాజమానుపెంటకు వెళ్లే రోడ్డు సంబంధించి రహదారి మరమత్తుల నిమిత్తం సిఫారసు చేయడం జరిగిందని దీంతో కొంతమంది ముందుకు వచ్చి రహదారి మరమత్తు పనులు జేసిబి సాయంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు.త్వరలోనే రహదారి పనులు కూడా పూర్తిగా మరమత్తు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ సింగిల్ విండో చైర్మన్ నాగరాజ నాయుడు,టిడిపి నాయకులు కొండేటి శివ,బాలకృష్ణ నాయుడు,పులిమడుగు రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *