

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్; పట్టణంలోని స్థానిక సాయి నగర్ లో వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కోవెల వద్ద దేవీ నవరాత్రుల సందర్భంగా పందిరి రాట మహోత్సవ కార్యక్రమం భక్తులు మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా అమ్మవారి కృపకి ప్రతి ఒక్కరూ పాత్రులు అవుతారని అందువలన ప్రతి గ్రామంలోనూ మరియు ప్రతి వీధిలోనూ దేవీ నవరాత్రులు నిష్టగా ఆచరించడం వలన గ్రామాలు తద్వారా రాష్ట్రం బాగుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు అత్యధికంగా మహిళ భక్తులు పాల్గొన్నారు.