

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ,మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల అయో శిల్పకారులు,దారు శిల్పకారులు,త్యస్ట శిల్పకారులు,శిల్పికారులు,స్వర్ణ శిల్పి కారులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.అనంతరం విశ్వకర్మ భగవాన్ స్వామి రధాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్ద ఊరేగింపు ముగించారు.యూనియన్ కార్యాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులంతా కలిసి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వీరబ్రహ్మేంద్రస్వామి వారు సృష్టికర్త అని ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి తూచా తప్పకుండా జరుగుతున్నాయని వారు అన్నారు. అంతేకాకుండా ఐదు రకాల శిల్పకారులకు చెందిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా యూనియన్ కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు,శ్రీ విశ్వకర్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు.