హెచ్ ఆర్ పి సి సభ్యులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ.ఎస్. డబ్ల్యూ.ఓ నాగేశ్వర్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు సహదేవ నాయుడు, పూల మనోహర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ రెడ్డి, పొన్నయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ రఘురాం, జిల్లా జానపద కళాకారుడు రెడ్డప్ప, అధ్యాపకులు అనంత కుమార్ లను ఆహ్వానించడం జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులను జ్ఞానవంతులు గా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు రంగాని సహదేవ నాయుడు, అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనద ని పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి జీవితాలను అందంగా తీర్చిదిద్దే వాస్తు శిల్పులు కూడా, అని తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని విద్యార్థులకు మార్గదర్శక వెలుగుగా ఉండి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి నిస్వార్థం గా పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించడానికి మనదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ‌ హెచ్ ఆర్ ఎస్ సి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను హెచ్ ఆర్ పి సి సభ్యులు ఘనంగా సత్కరించి మెమొంటో అందజేయడం జరిగింది. అనంతరం సన్మానం స్వీకరించిన ఉపాధ్యాయులు హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు ని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ లెవెల్ అడ్వైజర్ పూసల నరసింహులు, డిస్టిక్ లీగల్ అడ్వైజర్ రఘురాం, రాజేశ్వరిలు, మీడియా ఆఫీసర్, రామకృష్ణ, బ్లాక్ లెవెల్ ప్రెసిడెంట్ పాండురంగం, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..