చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ.ఎస్. డబ్ల్యూ.ఓ నాగేశ్వర్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు సహదేవ నాయుడు, పూల మనోహర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ రెడ్డి, పొన్నయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ రఘురాం, జిల్లా జానపద కళాకారుడు రెడ్డప్ప, అధ్యాపకులు అనంత కుమార్ లను ఆహ్వానించడం జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులను జ్ఞానవంతులు గా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు రంగాని సహదేవ నాయుడు, అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనద ని పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి జీవితాలను అందంగా తీర్చిదిద్దే వాస్తు శిల్పులు కూడా, అని తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని విద్యార్థులకు మార్గదర్శక వెలుగుగా ఉండి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి నిస్వార్థం గా పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించడానికి మనదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం హెచ్ ఆర్ ఎస్ సి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను హెచ్ ఆర్ పి సి సభ్యులు ఘనంగా సత్కరించి మెమొంటో అందజేయడం జరిగింది. అనంతరం సన్మానం స్వీకరించిన ఉపాధ్యాయులు హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు ని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ లెవెల్ అడ్వైజర్ పూసల నరసింహులు, డిస్టిక్ లీగల్ అడ్వైజర్ రఘురాం, రాజేశ్వరిలు, మీడియా ఆఫీసర్, రామకృష్ణ, బ్లాక్ లెవెల్ ప్రెసిడెంట్ పాండురంగం, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.