

కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు, దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది మరియు ఉభయదారులు పాల్గొన్నారు.
భక్తులు తరలి వచ్చి స్వామివారి దివ్య వైభవాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.