మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ గురుపూజోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సింగరాయకొండ , మూలగుంటపాడులోని అభ్యుదయ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి. హరిబాబు, ఒంగోలు స్మార్ట్ విజన్ కంటి వైద్యశాల టెక్నీషియన్ మాధవన్ మరియు పిఆర్ఓ లు పాల్గొని అందరికీ ఉచితముగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య, జెట్టి చంద్రశేఖర్ రెడ్డి, పి రామ్మూర్తి,గంజి రమణయ్య, కోటపాటి నారాయణ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.