–జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.
-శ్రీమతి రజిని ఇలా.. భర్త నాగమల్లి ఆలా..
-సమాజ సేవలో ఇద్దరూ ఇద్దరే.
ఉరవకొండ మన ధ్యాస:ఆమె పేరు రజిని. చక్కటి విద్యా బోధనలోరాటుడేలింది.భర్త నాగమల్లి రైతుల సేవలో తరిస్తూ ఇద్దరూ ఇద్దరే గా సమాజ సేవలో తల మునకలు అవుతున్నారు. గుణత్మక, తులనాత్మక బోధన చేస్తూ విద్యార్థి, విద్యార్థులను తీర్చి దిద్దుతూ
వజ్రకరూరు మండలం చిన్న హోతూర్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి రజిని కుమారి ని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తో సత్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు,జడ్పీ చైర్మన్ శ్రీమతి గిరిజమ్మ చేతుల మీదుగా “జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు”ను రజిని కుమారి అందుకున్నారు.
ఆమె మంచి సామాజిక సృహ, సేవా గుణం కలిగి ఉన్నారు.
2002..లో విద్యార్థులకు యోగ,ధ్యానాన్ని నేర్పించి సాధన చేపించినందుకు మరియు స్కౌట్ ట్రైనర్గా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలతో ప్రతి స్కూళ్లలో చెట్లు పెంచి పంచి పర్యావరణ రక్షించే బాధ్యతను విద్యార్థులకు నేర్పించారు.
శ్రీమతి రజిని దంపతులు పర్యావరణ పరిరక్షణ, యోగ విద్య, రైతుల సంక్షేమo కోసం నిరంతరం పాటు పడుతూ అందరి చేత మన్ననలు, ప్రశంసలు అందు కొంటున్నారు. ఆ దంపతులకు ఓ లైక్ కొడదాం.







