మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ రిట్టలపాడు గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణం కై రెండు దశాబ్దాలుగా అధికారులకు విన్నవించుకున్న నేటికీ రహదారి మోక్షం కలగలేదని.సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు సేబి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు.పెన్షన్ కోసం కొండ దిగి కిందకి రావాలంటే నిత్యవసర వస్తువులు కోసం వెళ్లాలన్నా అగమ్య గోచారం అవుతోందని.జ్వరాలు వస్తే రాత్రి వేళలో సీరియస్ అయితే డోలీలతో మోసుకుని రావాలి, లేదంటే మరణం తప్పదని అన్నారు.గిరిజనులకు అవగాహన లేక వైద్యం పట్ల ఎటువంటి ఆలోచన లేక మూఢనమ్మకాలతో చెట్టు మందులు మరియు భూత వైద్యులను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫెన్సన్ కోసం డోలీలు పెట్టి మోసుకుని రావాలని ఆ విధంగా ఆరోగ్యం బాగోకపోయినా పెన్షన్ కోసం కే ఆదమ్మ అనే వృద్ధ మహిళను డోలితో మూసుకొని వర్షంలో తడుచుకుంటూ కొండలు రాళ్లు దాటుకుంటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేటికీ కొనసాగడం దురదృష్టకరమని అన్నారు.ఆలూరు సెంటర్కు రిట్టలపాడు గ్రామం నుండి మూడుకిలోమీటర్లు పైగా నడవాలని దీని కారణంగా ఎక్కువ మంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని అవగాహన లేక రోడ్డు లేక 108 వాహనం రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు రహదారిని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రహదారుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి.ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న రోడ్లను నిర్మించి గిరిజన ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.ఐటీడీఏ పీవో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అభివృద్ధి కానీ వెనకబడిన ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని డిమాండ్.చేశారు.ఆదమ్మ అనే మహిళను డోలి పెట్టి మూడు కిలోమీటర్లు మోస్తూ మొత్తం ఆరు కిలోమీటర్లు నడవడం అటు ఇటు ఇబ్బందిగా ఉందని డోలీమోస్తున్న కిలపర్తి అప్పయ్య సేబి తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. మోతులకు స్వస్తి చెప్పి గిరిజన బతుకులను మార్చాలని లేదంటే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత నిర్వహించాలని అన్నారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వర మాట్లాడారు.







