

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు నందు వీధి, నంది విగ్రహం దగ్గర నుండి మెయిన్ రోడ్ వరకు రిటైర్డ్ తాసిల్దార్ కర్రోతు సత్యనారాయణ గారి ఆర్థిక సహకారంతో 25 మొక్కలను సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నాటారు. ప్రతి మొక్కకు ఐరన్ సెక్యూరిటీ గార్డ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ విజయబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాల్లో మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగి పెద్ద అయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో సంఘం ఉపాధ్యక్షులు అనుసూరి నాగేశ్వరరావు, కార్యదర్శి గోళ్ల నాగేశ్వరరావు, కోశాధికారి కోట శ్రీనివాస చక్రవర్తి, జాయింట్ సెక్రెటరీ తిరగట్టి సత్యనారాయణ, రౌతు సహదేవుడు, చిదంబరం, నిత్యానందం, పెచ్చెట్టి కృష్ణ ,నూతన సభ్యులు వెల్లంపల్లి రాజా, తాళ్లూరు గొల్లాజి తదితరులు ఉన్నారు.