మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ కమిటీ సభ్యులతో పాటు వార్డు సభ్యులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవాలయ పరిసరాల్లో పేరుకుపోయిన చిత్తాను తొలగించి భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆలయం వరకు వీధి దీపాల సౌకర్యం కల్పించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించే చూడాలన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు, ఏడవ వార్డు పెద్దలు తదితరులు ఉన్నారు.









