

మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు మగ్గం చీరలు,పట్టు చీరలు అంటేనే నారాయణపేట ప్రసిద్ధి అన్నట్టు ఉండేది రాను రాను నేతన్నలు తగ్గిపోవడం తో బంగారం కు ప్రసిద్ధి గా నిలిచిందన్నారు. పక్క జిల్లా గద్వాల్ చీరలకు ప్రసిద్ధి గా మారిందని,కారణం నేతన్న అభివృద్ధి చెందక పోవడం వల్లనే. సరైన వసతులు లేక గుర్తింపు లేక వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు సమయానికి అందక పోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.దాంతో చేనేత కార్మికులు కనుమరుగవుతున్నారని, ఇతర పనుల్లో చేరి ఆర్థికంగా మెరుగు పడడం కోసం కులవృత్తిని కూడా పక్కన పెట్టారన్నారు.కానీ నారాయణపేట లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలు మగ్గం ను నమ్ముకుని జీవిస్తున్నాయి. లాభం తక్కువ ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వృత్తిని వదిలి ఉండలేక అలాగే జీవనం సాగిస్తున్నారు. మగ్గాలు సతికిన పడ్డాయి . అసలైన చేనేత కుటుంబాలు వృత్తిని వదిలి ఇతర పనులలో స్థిరపడ్డారాని తెలిపారు.రానురాను నేతన్న కుటుంబాలు మొత్తానికే కరువైపోతాయా అన్న అనుమానం కూడా కలుగుతుందని. అందుకే నేతన్న అభివృద్ధి కోసం చేనేత కుటుంబాల అభివృద్ధి కోసం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకుని వారికి అండగా నిలబడతు మరింతగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని కమిటీ అధ్యక్షుడు డాక్టర్ క్యాతన్ రఘునాథ్ తెలిపారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి కుల దైవం భక్త మార్కండేయ స్వామి దేవాలయం లో స్వామిని దర్శించుకొని నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంబరి శ్రీనివాస్, తాటి కృష్ణ,ప్రధాన కార్యదర్శి తిలక్తో పాటు కార్యవర్గసభ్యులు నీలి బాలరాజ్,గడ్డం నర్సిములు,తాటి నారాయణ,సర్గం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.