

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏలేశ్వరం మూడో వార్డులో వైసీపీ పట్టణ ఉపాధ్యక్షులు పేకెల జాన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ హాజరై మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చర్చిలో సంఘస్తులు ఏర్పాటుచేసిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బత్తిన శ్రీను, పట్టా సుబ్బారావు, కొండబాబు, సత్యనారాయణ, శేఖర్, రాచర్ల రమేష్, గూడవల్లి చక్రం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.