

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉదయగిరి మండలం, గంగులవారి చెరువుపల్లి గ్రామం కి చెందిన తమ్ములూరి చిన్న పెంచలయ్య గత వారం నందిపాడు దగ్గర ప్రమాదం జరిగి చెన్నై లోని విజయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు తెలుసుకొని గంగులవారి చెరువుపల్లె లోని వారి కుటుంబ సభ్యులను కలుసి చిన్న పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విచారించి కాలుకి ఆపరేషన్ చేయాలని వారు తెల్పడంతో వైద్య ఖర్చుల కొరకు తక్షణ సహాయంగా 10వేల, జనసేన పార్టీ అడ్వైకేట్ కాకు మురళీ కృష్ణ అడ్వైకేట్ బార్ అసోసియేషన్ తరుపున 10 వెలు రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జనసేన పార్టీ కి చెందిన చిన్న పెంచలయ్య ప్రమాదవశాత్తు గాయపడటం చాలా బాధాకరమని, ప్రమాదంలో కాళ్ళకు తీవ్రమైన గాయాలు కావడం జరిగిందని, జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి ఒక 20 వేలు తక్షణ సాయంగా అందించడం జరిగిందని పెంచలయ్య త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాని, వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి సహాయం అందేలా కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు అనంతశెట్టి ఏడుకొండలు, ఇతర మండలాల అధ్యక్షులు పాలిశెట్టి శ్రీనివాసులు, రసూల్ పటాన్, రవి కుమార్, జనసేన ఉదయగిరి మండల నాయకులు కుర్ర కృష్ణ, పసుపులేటి తిరుపతయ్య, పెట్లు కిరణ్ కుమార్ జనసైనికులు నేరుకట్టు కృష్ణ, విష్ణు, వెంకటేశ్వర్లు, హరి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.