

మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఅనంతగిరి రెవిన్యూ పరిధిలో ఉన్న బొర్రా మామిడి పంచాయితీ బొడ్డపాడు తదితర గ్రామాలు మూట కూడు పంచాయతీ గ్రామాలకు అనంతగిరి రెవెన్యూ నుండి తొలగించి సర్వేలు నిర్వహించి అటవీ పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సేబి శ్రీరామ్ సొయ్యారి సన్యాసి ఎస్ రమేష్ ఆధ్వర్యంలో మూటకూడు బొడ్డపాడు జంక్షన్లో వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సేబిశ్రీరామ్ అటవీ హక్కులు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని మా భూములకు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని అన్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా సమస్య పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా నాయకులు. కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. సర్వేలు చేసినటువంటి రెవెన్యూ అధికారులు అనంతగిరి రెవిన్యూ లో ఉన్న ఈ భూములకు సాగు పట్టాలు ఇవ్వాలంటే రెవెన్యూ పరిధిలను తొలగించి పాచిపెంట మండలం రెవెన్యూ పరిధిలో మార్చి గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పిన అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు ఈ సమస్యపై అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడం గిరిజనులకు ఎటువంటి హక్కులు లేకుండా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రాయితీలు లేకుండా తీవ్రమైన కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు 2005లో ప్రజా పోరాటాల ఫలితంగా ఎర్రజెండా నాయకత్వంలో అటువక్కులు చట్టాన్ని సాధించుకోవడం జరిగిందని ఇటువంటి చట్టాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని ఎప్పటికైనా అనంతగిరి రెవిన్యూను పరిధిలో ఉన్న భూములను మార్పులు చేసి వెంటనే బొర్ర మామిడి పంచాయతీలో మూటకూడు పంచాయతీలో ఉన్నటువంటి భూములకు ఎగు గొట్టూరు పరిధిలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని దీనిపై ప్రత్యేకంగా ఐటీడీఏ పీవో మరియు జిల్లా కలెక్టర్ స్పందించి అనంతగిరి రెవిన్యూ లో ఉన్నటువంటి ఈ భూములకు ఆ రెవెన్యూ లను పాచిపెంట మండల గ్రామాల రెవిన్యూగా మార్చి గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఐటిడిఏ పిఓలు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడుతామని అన్నారు ఈ కార్యక్రమం లో గిరిజన సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.