గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా

సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన

మన న్యూస్ సింగరాయకొండ:-

నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం చేస్తున్న ముఠా గుట్టును సింగరాయకొండ సర్కిల్ జరుగుమల్లి పోలీసులు చేధించారు. నిఘా తో జరుగుమల్లి పోలీస్ లకు అందిన సమాచారం మేరకు జరుగుమల్లి మండలం వావిలేటి పాడు అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేపట్టడం తో మూడు కిలోల గంజాయి తోపాటు వివిధ దొంగతనాలలో దోచుకున్న 10 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకుని ముద్దాయిలు ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్ కి పంపినట్లు సి ఐ చావా హాజరత్తయ్య మీడియాకి వివరించారు. ఆమేరకు సోమవారం ఆయన తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ ఎంత నిఘా పెట్టినా 16 వ నంబర్ జాతీయ రహదారి కేంద్రంగా తరచూ గంజాయి చెలామణి రవాణా ముఠాలు పోలీస్ వలలో చిక్కి పోతున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ ప్రస్తుతం మద్దిపాడు లో నివాసం ఉంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హాజిమ్ గడ్ జిల్లా కి చెందిన ముకేశ్ కుమార్, గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం కి చెందిన సుమారు 65 కేసులతో పాటు ఏడు దొంగతనాలలో ముద్దాయి ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలు గుర్రం జాషువ కాలనీ కి చెందిన ట్రంక్ కార్తీక్ లను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి మూడు కిలోల గంజాయి, తొమ్మిది గ్రాముల బంగారు,యాభై ఏడు వెండి కడ్డీలు,మోటారు సైకిల్,ఇనుప కట్టర్, బంగారు వెండి కరిగించే మిషన్ లను స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపినట్లు సి ఐ వివరించారు. సి ఐ వివరిస్తూ గతం లో 65 కేసుల్లో ముద్దాయిగా ఉండి చీమకుర్తి, ఒంగోలు తాలూకా, హనుమంతునిపాడు ,పొన్నలూరు,జరుగుమల్లి,కొండపి పోలీస్ స్టేషన్ ల పరిధిలో దొంగతనం కేసులు నమోదు కాగా పలు మార్లు జైలు కి పోయి వచ్చాడని వివరించారు. గంజాయి చెలామణి రవాణా కేసు లో విశేష కృషి చేసిన సి ఐ హాజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, జరుగుమల్లి పోలీస్ సిబ్బంది తో పాటు సి సి ఎస్ సిబ్బందిని కూడా ఎస్పీ ఎ ఆర్ దామోదర్, డి ఎస్ పి. రాయపాటి శ్రీనివాసరావు లు అభినందించారని ఆయన పేర్కొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///