

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ:-
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం మరియు బింగినిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు 30 వేల రూపాయలు విలువ చేసే నోట్ పుస్తకాలు, పలకలు, పెన్సిల్లు మరియు టి ఎల్ ఎం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గుంటక రామలక్ష్మమ్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని,దీనిలో భాగంగానే తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాపరమైన సహకారం అందించుటకు మానవత స్వచ్చంద సంస్థ తమ వంతుగా కృషి చేస్తుందన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి మహంకాళి నరసింహ రావు పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలని, తమ పిల్లల విద్యా ప్రగతిని ప్రతిరోజు పరిశీలించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫస్ట్ జనరేషన్ లో విద్యను అందుకోవటంలో విఫలమైననూ,సెకండ్ జనరేషన్లో మాత్రం తప్పనిసరిగా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తును అందించాలన్నారు.ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం వినియోగించుకొని ప్రభుత్వం అందించు విద్యాపరమైన అవకాశాలను అందుకోవాలనన్నారు.కార్యక్రమానికి కోటపాటి నారాయణ అధ్యక్షత వహించగా మానవత సభ్యులు ఎం వి రత్నం,జె.వి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, రమణారెడ్డి, శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయులు మాలిరావు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
