రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు టెంట్లు లోనికి వెళ్లి కూర్చోవడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ జీ.ఓ. నెంబర్ 36 సంబంధించిన జీతాలు వర్తింప చేయాలని, 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని, ప్రభుత్వం సానుభూతి మాటలు కాకుండా నిర్దిష్టమైన హామీలతో, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ చేశారు. కార్మికులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో తమ పిల్లలను చదివించుకోలేక, ఇంటి బాడుగలు, కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులలో పస్తులు ఉంటూ నానా ఇబ్బందులకు పడుతున్నామని, కనీసం సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కూడా మాకు వర్తించడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు సంఘ నాయకులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు, పి.భాస్కర్ వై.సుబ్రహ్మణ్యం, కె.పో లయ్య,ఎస్.కామేశ్వరరావు, ఎస్.కె.నయీం,సి.హెచ్. సుబ్బారావు,గూడూరు సి.ఐ.టి.యు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///