

మన న్యూస్ సింగరాయకొండ:-
ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్ మసీదు లో నిర్వహించిన ఇంటిన్సిఫైడ్ టి బి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా ధీరేంద్ర టి బి వ్యాధి పై అవగాహన కల్పిస్తూ ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గు జ్వరము ఉన్నా దగ్గినప్పుడు కళ్ళే లో రక్తం పడడం బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వారు వెంటనే సమీపం లోని వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలని పిలుపు ఇచ్చారు. ఎటు వంటి అనుమానం వచ్చినా సమీపం లోని టి బి సేవా కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు చూపించి తగిన వైద్య సలహాలు పొందాలన్నారు. టి బి కి ఆయుష్మాన ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన పరీక్షలు ఉచితంగా పొందే అవకాశం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనలకు వచ్చిన ప్రజలు అవగాహన పొందారు. ఈ కార్యక్రమం లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆరోగ్య పర్యవేక్షకుడు మసూద్ ఆలీ,టి బి పర్యవేక్షకుడు నిస్సార్ హఫీజ్ సాహెబ్,కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.