

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్.కె. రోజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, పార్టీ యువజన విభాగ గౌరవ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు, పీడీసీసీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైఎమ్ ప్రసాద్ రెడ్డి (బన్నీ) గారు పాల్గొన్నారు.
ప్రజల భద్రతా హామీలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్యకర్తల సందేహాలు నివృత్తి చేస్తూ పార్టీకి సంఘటిత బలం అందించేందుకు నాయకులు పిలుపునిచ్చారు.