

సింగరాయకొండ మన న్యూస్ :-
భద్రత నిబంధనలు పాటించకుండా రహదారి పై వాహనాలు నడపడం ప్రమాదకరమని మీ ప్రాణం మీ భద్రత అని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు వాహన చోదకులకు హితవు చెప్పారు. శుక్రవారం టంగుటూరు కొండపి రోడ్డు లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద వాహన తనిఖిలు చేపట్టి ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పిస్తు ద్విచక్ర వాహన చోదకులు వాహనం నడిపే సమయం లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రాణం విలువను తెలుసుకోవాలన్నారు. అంతే కాకుండా వాహనం నడిపే సమయం లో తప్పని సరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా చెల్లింపు రసీదు కలిగి ఉండాలని వాహన చోదకులకు అవగాహన కల్పించారు. సరయిన పత్రాలు చట్టపరమైన అవసరానికి మాత్రమే కాదు ప్రాణాల భద్రత కి కూడా ముఖ్యమయినవి గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే చట్టమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం నడిపే సమయం లో సెల్ ఫోన్ వాడడం అనర్ధ దాయకమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన వంట టంగుటూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు