

మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సూపర్ సెక్స్ పథకాలు లబ్ధి చేకూరుతాయని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం 38వ డివిజన్ పరిధిలోని సింగాలగుంటలో క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వి పుష్పవతి యాదవ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసింహ యాదవ్ తో పాటు రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరై ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తిరుపతి నియోజకవర్గ అన్ని రంగాలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్, వెంకట కీర్తి, సందీప్ రేవతి సంతోష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.