మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమీక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుండి తెలియజేయాల్సిన అంశాలు ఇలా ఎన్నో,ఎన్నెన్నో, ఉంటాయి. అంతేగాక మండల సమావేశానికి ప్రభుత్వం కొంత నగదు ఖర్చు పెడుతుంది. అన్ని విషయాలు మండల సర్వసభ్య సమావేశానికి గర్హాజరు కావడం అంటే ఓ పథకం ప్రకారం అయినా అయి ఉండాలి. లేదంటే అక్కడ చెప్పేది మేమే వినేది ఏముందిలే అని అయినా అనుకోని ఉండాలి. ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమావేశాలకు తప్పక హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా బాధ్యత కలిగిన అధికారులు సమావేశాలకు హాజరై తాము చేసిన పనులను ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు సభ్యులకు వివరించాల్సిన అధికారులు ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరందరూ ఇకనైనా మారుతారు లేక ఏమవుతుందిలే మన గురించి అనుకునేది ఎవరు లే అని సరిపెట్టుకుంటారు వేచి చూడాలి మరి??

  • Related Posts

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలోని పెదనపాలెం గ్రామంలో ఉన్న మంచినీటి బావిని ఎంపీడీవో గురువారం సందర్శించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి…

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    మన న్యూస్ తవణంపల్లె జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో గల పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన తవణంపల్లె…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు