కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమీక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుండి తెలియజేయాల్సిన అంశాలు ఇలా ఎన్నో,ఎన్నెన్నో, ఉంటాయి. అంతేగాక మండల సమావేశానికి ప్రభుత్వం కొంత నగదు ఖర్చు పెడుతుంది. అన్ని విషయాలు మండల సర్వసభ్య సమావేశానికి గర్హాజరు కావడం అంటే ఓ పథకం ప్రకారం అయినా అయి ఉండాలి. లేదంటే అక్కడ చెప్పేది మేమే వినేది ఏముందిలే అని అయినా అనుకోని ఉండాలి. ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమావేశాలకు తప్పక హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా బాధ్యత కలిగిన అధికారులు సమావేశాలకు హాజరై తాము చేసిన పనులను ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు సభ్యులకు వివరించాల్సిన అధికారులు ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరందరూ ఇకనైనా మారుతారు లేక ఏమవుతుందిలే మన గురించి అనుకునేది ఎవరు లే అని సరిపెట్టుకుంటారు వేచి చూడాలి మరి??