

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు చేతుల మీదుగా పాఠశాల వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఎం.ఈ.ఓ శ్రీ కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, “విద్యార్థుల్లో చిన్ననాటినుంచే గురుభక్తి, దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత వంటి విలువలపై అవగాహన కల్పించాలి. విద్య వినయంతో కూడినపుడే అది విద్యార్థి జీవితాన్ని శక్తివంతంగా మార్చగలదు” అని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, తాను కూడా ఉమామహేశ్వరరావు శిష్యుడని, ఆయన విద్యారంగానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. శిష్యుడు గురువుకు అంకితం చేస్తూ నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల్లో గురుభక్తి విలువను పెంచుతుందని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేశవరాజు, రమణారెడ్డి, రామారావు, అజయ్, హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సుబ్బారెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.