

మన న్యూస్ తవణంపల్లె జులై-10
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో గల పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన తవణంపల్లె మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిని ప్రకటించారు. తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా వెంకటేష్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనా వెంకటేష్ చౌదరికి ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పట్ల వారి నిబద్ధతను కొనియాడారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… పూతలపట్టు, ఐరాల, యాదమరి, బంగారుపాళ్యం మండలాల అధ్యక్షుల ఎన్నిక ఇటీవల్ల నాయకులు, కార్యకర్తల్లో ఎలాంటి మనస్పర్ధలకు తావులేకుండా నిర్వహించామో అదే తరహాలో తవణంపల్లె మండల అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఐక్యతను సూచిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో నూతన నాయకత్వం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తి, పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరింతగా బలపరచాలి” అని అన్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున వీరు చేసిన కృషి మరచి పోలేనిదన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ పని చేసిన వీరు పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన కోరుకున్నారు. “రాబోయే రోజుల్లో పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, పూతలపట్టు నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దాలన్నదే మన ఆశయంగా, కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. నాయకత్వ మార్పులతో కొత్త ఉత్సాహం నింపుకుని పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింతగా పెంచేలా పని చేయాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.