

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలోని పెదనపాలెం గ్రామంలో ఉన్న మంచినీటి బావిని ఎంపీడీవో గురువారం సందర్శించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు వేసవికాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని చర్యలు చేపట్టారు.బావి పరిసరాలలో ఉన్న మొక్కలను, చెట్లు, పొలాల చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయంతో బావి అభివృద్ధికి తగిన ఎస్టిమేట్ రూపొందించి, బావి చుట్టూ గేట్ ఏర్పాటు చేయాలని, పై భాగాన మెష్ అమర్చాలని ఆదేశించారు. బావి వద్ద మురుగు ప్రవాహం లేకుండా మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దనపాలెం గ్రామ పెద్దలు, బింగినపల్లి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
