

మనన్యూస్,,అమరావతి:ఉదయగిరి మరియు గిద్దలూరు నియోజకవర్గాలలోని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని ఉదయగిరి , గిద్దలూరు ఎమ్మెల్యేలు శ్రీ కాకర్ల సురేష్, శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అమరావతిలోని మంత్రి నివాసంలో బుధవారం సాయంత్రం కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రితో మాట్లాడుతూ ఉదయగిరి, గిద్దలూరు, నియోజకవర్గాలలో రైతులు పండించిన తెల్లబర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. నష్టాల బాటలో రైతులు ఉన్నారని వారికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు గారు జిపిఏ, అలియన్స్ కంపెనీ వారితో మాట్లాడి ఉదయగిరి ,గిద్దలూరు, నియోజకవర్గాలలోని పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఉదయగిరి, గిద్దలూరు,నియోజకవర్గ రైతుల తరుపున ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, అశోక్ రెడ్డి గార్లు మంత్రి అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదములు తెలిపారు..