

మనన్యూస్,కలిగిరి : కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లో బుధవారం రాత్రి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
పెద్దపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నీరాజనాలు పలికారు. బొల్లినేని వెంకట రామారావు, ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బొల్లినేని వెంకట రామారావు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ, ఇంటింటికి తిరిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం మార్గాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం మార్గాలను చూపుతామని తెలియజేశారు. అనంతరం గ్రామ మహిళలు తో మాట్లాడుతూ, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కొరవలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి అంటూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తుందని, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సారథ్యంలో ఉదయగిరి సిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కొండూరు గ్రామపంచాయతీ కీ సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చేయిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెల్లంకి కొండప నాయుడు, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, రాయల కొండప నాయుడు, ఇరుపునేని రవీంద్ర, ద్రోణాదుల సురేష్, మన్నేపల్లి వెంకట్రావు, ఈరుపునేని రామాంజనేయులు, కాట్రగుంట అశోక్, చావ సునీల్, ద్రోణాదుల శివరాం, మరియు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.