

రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే గానీ ప్రతిపక్షమే గానీ – రెండూ ఒకే నాణానికి బొమ్మ బోరుసుల వంటివి. సమానమైన చైతన్యంతో పనిచేయగలిగితేనే విజయాన్ని సాధించగలము,” అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మనస్సుల్లో స్థిరపడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి అని పేర్కొన్న ఆయన, “సంస్థను రక్షించగలిగినప్పుడే అది మనల్ని రక్షిస్తుంది. వైఎస్ఆర్సిపి ఒక సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ సంస్థ. అందుకే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది,” అని తెలిపారు.కార్యకర్తలు నిరాశ చెందకుండా, విశ్వాసంతో, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం జరిపితే ప్రజల మన్ననలు పొందవచ్చు. తద్వారా మళ్లీ అధికారం లోకి రావడం సహజమవుతుందని చెప్పారు.ఈ సమావేశానికి రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జి డాక్టర్ తలె రాజేష్ అధ్యక్షత వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
