ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం సుగుణమ్మ ఇంటిముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వాక్యాలు వైసిపి దిగజారుడుతనానికి పరాకాష్టాన్ని దుయ్యపెట్టారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అస్లీల పదజాలాన్ని ఖండించడానికి కూడా జగన్ రెడ్డి ముందుకు రాకపోవడం మహిళలను అవమానించడమే అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే అడుగడుగున అవమానపరిచే నీచ సంస్కృతి జగన్ రెడ్డి పార్టీకే తగునని పేర్కొన్నారు. సొంత చెల్లెలు షర్మిల చీర కట్టుకోవడం పైన జగన్ రెడ్డి అండ్ కో విమర్శలు చేశారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వైసిపి నేతలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాజకీయాలలో మహిళలు లాగే సంస్కృతి వైసిపి తోనే మొదలైందని ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసిన వారికి బుద్ధి రాలేదన్నారు. మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై ఏనాడు ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయమని ప్రశ్నించినందుకు వైయస్ సునీత రెడ్డి పై ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా అడిగినందుకు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెట్టించారన్నారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వాక్యాలకు జగన్ రెడ్డి బేసరత్తుగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర రాయల్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్లు బాలసుబ్రమణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, రజక సంఘం నేత అశోక్, మేడికుర్తి విశ్వనాథ్ మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!