జలదంకి, ఫిబ్రవరి 14,(మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె..
మహా శివరాత్రి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న…సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి..ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డి..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల కేంద్రమైన జలదంకిలోని శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశస్థాపన చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద కుందుర్తి సతీష్ శర్మ అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని పవిత్ర జలంతో శుద్ధి చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని ఎగురవేశారు.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు శనివారం ఆలయంలో వైభవ్వేతంగా ధ్వజారోహణం నిర్వహించారు.. అంతకుమునుపు ధ్వజస్తంభానికి పాలు, తేనె వంటి పంచామృతరాలతో అభిషేకం నిర్వహించి అగ్ని, గాలి వంటి పంచభూతాలుగా అన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. మంగళ వాయిద్యాలు, హర హర శంభో శంకర అంటూ భక్తుల నినాదాలు మధ్య అర్చక బృందం ధ్వజం స్తంభం చుట్టూ దర్భను చుట్టిన తర్వాత నందీశ్వరుని చిత్రపటాన్ని ధ్వజసంభ శిఖరబాగాన ప్రతిష్టించడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదలను పంపిణీ చేశారు..
