

ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే అనుమతి ఉన్నది. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి మరియు ఇతర జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనకుండా ఉంటే మంచిదని ఎస్ఐ సుమన్ తెలిపారు అలాగే శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కనుక ఎస్ఆర్ పురం వైసిపినాయకులు, ప్రజా ప్రతినిధులు, మరియు కార్యకర్తలు పాల్గొనకుండా ఉండాలని ఎస్సై సుమన్ తెలిపారు