

దుత్తలూరు,మనన్యూస్ : దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు సేవలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తరించారు. శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ముగిసి 16 రోజుల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులు కమిటీ సభ్యులతో మాట్లాడారు. వరికుంటపాడు మండలం కాకుల వారి పల్లె నివాసి మధువన్ గ్రూప్ హోటల్స్ అధినేత నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తమ చేతుల మీదుగా భోజనాన్ని వడ్డించారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కరచాలం చేస్తూ అభివాదం చేశారు. చిన్నారుల కోలాట నృత్యాన్ని కనులారా తిలకించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ వెంట మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, దుత్తలూరు మండల నాయకులు, ఆలయ చైర్మన్లు, కమిటీ సభ్యులు భక్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.