డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు 50వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలయోగినగర్ మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 6,000₹ రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి జీవితంలో బాల్యం ఎంతో విలువైందని, మొక్క ఎదుగుదలలో ఏ విధంగా జాగ్రత్త వహిస్తామో,అదేవిధంగా పిల్లల మానసిక, వ్యక్తిత్వం ఎదుగుదలకు బాల్యంలోనే మంచి పునాది వెయ్యాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా క్రమశిక్షణతో కూడిన విద్యను పొందాలన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ భవన నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మానవత సంస్థ ప్రతినిధి కోటపాటి నారాయణ మాట్లాడుతూ 2025 – 26 విద్యా సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా మండల పరిధిలోని పాఠశాలలలోని చిన్నారులకు అవసరమైన స్టేషనరీ అందించుటలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
అనంతరం డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు ను పాఠశాల సిబ్బంది మరియు మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె.వి.సుబ్బారావు,శిగా మోహన్,అర్రిబోయిన రాంబాబు,సుధాకర్ రెడ్డి,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, మానవతా ప్రతినిధులు మహంకాళి నరసింహారావు, గుంటక రామలక్ష్మి, ఉపాధ్యాయులు నరేంద్ర, మారుతీ దేవి, కొల్లూరు వెంకయ్య,పూర్ణచంద్రరావు,హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *