మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యతో పాటు విద్యార్థులు ఉన్నత విలువలు గల వ్యక్తులుగా గుర్తింపబడాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఫోక్సో చట్టం,సైబర్ చట్టాలు, సైబర్ నేరాలు,మిస్సింగ్ కేసులు, తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఫేస్బుక్ ఇంస్టాగ్,వంటి వెబ్సైట్ల ద్వారా మహిళలు,యువత మోసాలకు గురవుతున్నారని అన్నారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాలలో దూరంగా ఉండాలని ఆమె సూచించారు.విద్యార్థి దశలో తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఉత్తమ విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని. ఎస్సై విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పాఠశాల అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *