బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ గారు

మన న్యూస్ సింగరాయకొండ:-

పాత సింగరాయకొండ శ్రీ వరాహా లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీ 06.06.02025 నుండి 16.06.2025 జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కళ్యాణోత్సవం మరియు రథోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అక్కడ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా జిల్లా ఎస్పీ గారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గములు, క్యూలైన్లను భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయం, రథం వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. దర్శనానికి విచ్చేసే భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానస్పద కదలికలు, వ్యక్తులపై నిఘా ఉంచి తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా పట్టిష్టమైన బందోబస్తు నడుమ ప్రశాంతంగా భక్తులు దర్శనం జరిగేలా చూడాలని, పార్కింగ్ , ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని, డ్రోన్/ సీసీ కెమెరాల నిఘాతో ఉంచాలని, బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, రథోత్సవం జరిగే సమయంలో ఎలాంటి తోపులాట్లు, అవాంతరాలు జరగకుండా రథోత్సవం విజయవంతంగా ముగిసేలా సమన్వయం, సమయస్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘాట్టాలైన కళ్యాణోత్సవం మరియు రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ గారు వెంట సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, సింగరాయకొండ ఎస్సై మహేంద్ర మరియు సిబ్బంది ఉన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *