ధర్మ పాలకుడు మన చంద్రబాబు-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్.అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు అంశాల మధ్య ఎక్కడా ప్రాధాన్యతా క్రమంలో హెచ్చుతగ్గులు రాకుండా చూసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకెళుతున్న ధర్మ పాలకుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.గత వైసిపి ప్రభుత్వ అధినేత జగన్ రెడ్డి విధ్వంసం కారణంగా ఆర్ధికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పధకాలలో ఒకటైన ‘తల్లికి వందనం’ పధకానికి అర్హులైన సుమారు యాభై ఐదు లక్షల మంది తల్లులకు ఈరోజు వారివారి బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేశారని కొనియాడారు.చదివే పిల్లలు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా, అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఆ మాటను నిజం చేస్తూ మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన సుమారు 54, 94, 703 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేశారని కొనియాడారు.సూపర్- 6 లో ప్రకటించిన విధంగానే “తల్లికి వందనంపథకం అమలులో ఒక్కరే సంతానం ఉన్న మహిళలు 18.55 లక్షల మంది, ఇద్దరు సంతానం ఉన్న మహిళలు 14.55 లక్షలు, ముగ్గురు పిల్లలు ఉన్న వారు 2.1 లక్షలు, నలుగురు పిల్లలు ఉన్న వారు 20 వేల మంది తల్లులు ఉన్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు డబ్బు కూటమి ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు.అభివృద్ధి, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఏమీ లేకుండా కేవలం బటన్ నొక్కడం ఒక్కటే తెలిసిన జగన్ రెడ్డి కంటే, అటు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది అని కొనియాడారు.బాబుతో పోటీ పడడం అంత ఈజీ కాదని ఇప్పటికైనా జగన్ తెలుసుకుంటే మంచిది అని, తల్లికి వందనం పథకం గురించి హేళనగా మాట్లాడిన జగన్ రెడ్డి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయడంతో, జగన్ రెడ్డి ఆత్మ రక్షణలో పడ్డాడని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకులు బీమాల భాస్కర్, మణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..